కొత్త చ‌రిత్ర‌.. విక్ర‌మాదిత్య‌పై స్వ‌దేశీ ఎయిర్‌క్రాఫ్ట్ స‌క్సెస్‌ఫుల్ ల్యాండింగ్‌

 భార‌త నౌకాద‌ళ చ‌రిత్ర‌లో ఇవాళ కొత్త అధ్యాయం మొద‌లైంది. యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్ర‌మాదిత్యపై.. నావెల్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను విజ‌య‌వంతంగా ల్యాండ్ చేశారు. ఎల్‌సీఏను డీఆర్‌డీవో త‌యారు చేసింది. స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో త‌యారైన యుద్ద విమానాన్ని.. విక్ర‌మాదిత్య‌పై దించ‌డం ఇదే తొలిసారి. ఈ ఫైట‌ర్ విమానాన్ని డెవ‌ల‌ప్ చేసేందుకు ఏరోనాటిక‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ఏజెన్సీ తీవ్రంగా కృషి చేస్తున్న‌ది. గోవాలోని షోర్ బేస్డ్ టెస్ట్ ఫెసిలిటీ సెంట‌ర్‌లో ఈ ప‌రీక్ష కొన‌సాగింది. విక్ర‌మాదిత్య‌పై ల్యాండ్ అయ్యేందుకు పైల‌ట్లు కొన్ని వంద గంట‌ల పాటు ట్రైనింగ్ చేశారు