సంక్రాంతి పండుగ సందర్భంగా నగర వాసులు సొంతూళ్లకు బయలుదేరడంతో జాతీయ రహదారులపై రద్దీ కనిపిస్తోంది. పాఠశాలలు, కళాశాలకు సెలవులు రావడంతో స్వగ్రామాల్లో పండుగ జరుపుకునేందుకు తరలివెళ్తుండటంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటికిటలాడుతున్నాయి. టోల్‌ప్లాజాల వద్ద అక్కడక్కడా ట్రాఫిక్ జామ్ అవుతోంది. మాడ్గుపల్లి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీగా బాగా ఉంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. ఇక నిమిష నిమిషానికి హైవేలపై రద్దీ పెరిగిపోతోంది. టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి.